వరుస లాభాలకు బ్రేక్!

by  |
వరుస లాభాలకు బ్రేక్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. గత పది రోజులుగా జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేస్తూ వస్తున్న సూచీలు బుధవారం నాటి పరిణామాలకు డీలాపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవ్యవస్థ 9.6 శాతం కుదించుకుపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనల నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా గడిచిన పది రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీతో కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 263.72 పాయింట్లు కోల్పోయి 48,174 వద్ద ముగియగా, నిఫ్టీ 53.25 పాయింట్లు నష్టపోయి 14,146 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు అమ్మకాల ఒత్తిడితో డీలపడగా, ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, ఆల్ట్రా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కదలాడగా, ఐటీసీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్, హిందూస్తాన్ యూనిలీవర్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.08 వద్ద ఉంది.



Next Story