ఒక్కరోజు గ్యాప్‌తో ఎగిసిన మార్కెట్లు

by  |
ఒక్కరోజు గ్యాప్‌తో ఎగిసిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస లాభాల అనంతరం బుధవారం నష్టాలను నమోదు చేసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం మునుపటి జోరునే కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం మార్కెట్లు 123 పాయింట్లతో లాభాల బాట పట్టాయి. అదే జోరుతో కొనసాగిన మార్కెట్లు మిడ్ సెషన్ సమయానికి మరింత దూకుడును పెంచాయి. విదేశీ మార్కెట్ల సానుకూలత, గత వారం నుంచి కొనసాగుతున్న సెంటిమెంట్ పరిణామాలు మార్కెట్లకు కలిసొచ్చాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్ల లాభాలు ఒకరోజు విరామంతో మళ్లీ అదే జోరును అందుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 408.68 పాయింట్లు లాభపడి 36,737 వద్ద ముగియగా, నిఫ్టీ 107.70 పాయింట్లు ఎగిసి 10,813 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టాటాస్టీల్ హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్, హెచ్‌సీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, మారుతీ, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి.



Next Story

Most Viewed