మార్కెట్లలో ఐదోరోజూ లాభాల జోరు!

by Harish |
మార్కెట్లలో ఐదోరోజూ లాభాల జోరు!
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటిష్‌ యూనివర్శిటీ ఆక్స్‌ఫర్డ్‌ సహకారంతో ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుందన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లలో ఓ సెంటిమెంట్ బలపడింది. కోవిడ్‌-19 కట్టడికి త్వరలో వ్యాక్సిన్‌ వెలువడగలదన్న అంచనాలతో వరుసగా ఐదోరోజూ దేశీయ ఈక్విటీ‌ మార్కెట్లు జోరు కొనసాగించాయి. మిడి సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు సిద్ధమవడంతో సెన్సెక్స్‌ ఏకంగా 500 పాయింట్లకు పైగా ఎగిసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 511.34 పాయింట్లు లాభపడి 37,930 వద్ద ముగియగా, నిఫ్టీ 140.05 పాయింట్ల లాభంతో 11,162 వద్ద ముగిసింది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అండతో నిఫ్టీ బ్యాంక్, రియల్టీ, ఆటో రంగాలు పుంజుకోగా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు కొంత బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, మారుతీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఓఎన్‌జీసీ షెర్లు అత్యాధిక లాభాల్లో ట్రేడవ్వగా, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed