విద్యాదీవెనపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

by  |
AP-HIGH-COURT
X

దిశ, ఏపీ బ్యూరో: జగనన్న విద్యా దీవెన పథకంపై ఏపీ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు వెల్లడించింది. విద్యాదీవెన పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బు జమపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని కృష్ణదేవారాయ విద్యాసంస్థల తరపున శ్రీవిజయ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. విద్యాదీవెన సొమ్మును ఫీజుగా కళాశాల ఖాతాల్లో వేయాలని న్యాయవాది శ్రీవిజయ్ కోరారు. వాదనలు విన్న హైకోర్టు విద్యా దీవెన మొత్తాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. నేరుగా కళాశాలల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో హైకోర్టు అప్‌లోడ్ చేసింది.

Next Story

Most Viewed