సింగరేణి ప్రైవేటీకరణపై సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

by  |
సింగరేణి ప్రైవేటీకరణపై సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
X

దిశ, భూపాలపల్లి: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. కార్మికులు పోరాడాలని సింగరేణి ఏరియా మావోయిస్టు కార్యదర్శి ప్రభాత్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ ప్రభుత్వ ఏడేండ్ల పాలనలో కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ప్రజలకు ఉపయోగపడే ఏ పనులు చేయలేదన్నారు. చివరకు దేశభక్తి ముసుగులో జాతీయోన్మాదాన్ని, భావోద్వేగాలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. భరతమాతను బజారులో నిలబెట్టి మానిటైజేషన్ పేరుతో దేశ సంపదలను, ప్రభుత్వ రంగ సంస్థలను.. కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు అమ్మివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్మికవర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను, చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చి అన్యాయం చేశారన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయనీయమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 19 శాతం వాటాను కూడా కొనుగోలు చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం సరికాదన్నారు. సింగరేణికి చెందిన కోయగూడం, సత్తుపల్లి ఓసి-3 , కళ్యాణిఖని -6, శ్రావణపల్లి ఓసీలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి కుట్రతో అనుమతి ఉత్తర్వులు జారీ చేస్తే కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. వీటికి నిరసనగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక-ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed