‘వారు ఆ తేదీలోగా మొదటి డోసు తీసుకోవాలి’

by  |
‘వారు ఆ తేదీలోగా మొదటి డోసు తీసుకోవాలి’
X

దిశ,వెబ్ డెస్క్: నేటి నుంచి కొవిడ్ టీకా రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. గత నెల 16న కొవిడ్ తొలి డోస్ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తొలి డోస్ తీసుకున్న వైద్యారోగ్య సిబ్బందికి నేడు రెండో డోస్ టీకా ఇవ్వనున్నారు. మొత్తం 140 కేంద్రాల్లో కొవిడ్ టీకాలను ఇవ్వనున్నారు. మొదటి డోస్ తీసుకున్న చోటే రెండో డోస్ వేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. మొదట ఏ కంపెనీ డోస్ తీసుకుంటే మళ్లీ అదే కంపెనీ డోస్ తీసుకోవాలని సూచించింది. మొదటి డోస్ తీసుకోని వైద్య సిబ్బంది ఈ నెల 25 లోగా తీసుకోవాలని చెప్పింది. ఈ నెల 25 తర్వాత మొదటి డోస్ ఇచ్చే అవకాశం లేదని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.



Next Story

Most Viewed