సెకెండ్ వేవ్‌తో దేశీయ ఆటో పరిశ్రమలో డిమాండ్ క్షీణించే ప్రమాదం : ఇండ్-రా

by  |
సెకెండ్ వేవ్‌తో దేశీయ ఆటో పరిశ్రమలో డిమాండ్ క్షీణించే ప్రమాదం : ఇండ్-రా
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా రానున్న రోజుల్లో దేశీయ ఆటో పరిశ్రమలో డిమాండ్ క్షీణించే ప్రమాదం ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) అభిప్రాయపడింది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగతే కమర్షియల్ వాహనాలకు డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో సగలో పుంజుకోవచ్చని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా ఈ పరిశ్రమ వృద్ధికి తోడ్పడుతుందని, ప్రధానంగా మీడియ, హెవీ కమర్షియల్ వాహన అమ్మకాలకు ఊతమిస్తుందని వివరించింది. 2020-21లో ఆటో పరిశ్రమ దేశీయ విక్రయాలు 14 శాతం మేర క్షీణించాయి. ఇందులో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2 శాతం, కమర్షియల్ వాహన అమ్మకాలు 21 శాతం తగ్గాయి. టూ-వీలర్ అమ్మకాలు 13 శాతం క్షీణించాయి. మార్చి నెల అమ్మకాల్లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు రెండంకెల స్థాయిలో తగ్గడాన్ని గమనిస్తే వినియోగదరుల సెంటిమెంట్ ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకున్న సంకేతాలు కనిపించడంలేదని ఇండియా రేటింగ్స్ వివరించింది.


Next Story

Most Viewed