ఒమిక్రాన్ ఎఫెక్ట్ : మళ్లీ మూతబడనున్న స్కూల్స్..?

by  |
schools opening
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి కొవిడ్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. కొత్తగా సౌత్ ఆఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ కొవిడ్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇది ఇండియాలో వెలుగుచూసిన డెల్టా వేరియంట్ కంటే చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించడమే కాకుండా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు తప్పకుండా కొవిడ్ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ క్రమంలోనే బృహన్ ముంబై కార్పొరేషన్ పరిధిలో తెరుచుకోవాల్సిన పాఠశాలలు మరోసారి మూతబడ్డాయి. డిసెంబర్ -1నుంచి బీఎంసీ పరిధిలో పాఠశాలలు ఓపెన్ కావాల్సి ఉన్నా ఒమిక్రాన్ వేరియెంట్ వలన డిసెంబర్ 15 వరకు స్కూళ్ల ఓపెనింగ్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు పాఠశాలలు తెరుచుకోనున్నాయనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని BMC అధికారులు వెల్లడించారు. ముంబైలో మాదిరిగానే దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాఠశాలల మూసివేతపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed