ఈనెల 31 వరకు విద్యాసంస్థలు బంద్..

by  |
ఈనెల 31 వరకు విద్యాసంస్థలు బంద్..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్టు వెల్లడించింది. అయితే వైద్య, నర్సింగ్ కళాశాలలను మాత్రం మూసివేయడం లేదని పేర్కొంది.

సినిమా హాళ్లలో సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలని, షాపింగ్ మాల్స్ లో ఏ సమయంలోనైనా 100 మందికి మించి ఉండరాదని సర్కారు నిబంధనలు విధించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలు చేయడమే కాకుండా, అదనంగా మరో రెండు గంటల పాటు పొడిగించాలని నిర్ణయించింది. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 మంది వరకే అనుమతిస్తామని స్పష్టం చేసింది. పబ్లిక్ గ్యాదరింగ్స్‌పై నిషేధం విధిస్తూ.. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది.

Next Story

Most Viewed