ఆ మందులపై కేంద్రాన్ని ప్రశ్నించిన 'సుప్రీం'

by  |
ఆ మందులపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 చికిత్సకు అనుమతి లేకుండా రెమ్‌డెసివిర్, ఫావిపిరవిర్ మందులను వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. రెమ్‌డెసివిర్, ఫావిపిరవిర్‌లను కరోనా చికిత్సకు మందులుగా పేర్కొనలేదని కేంద్రం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ పేరుతో వివిధ మందుల విక్రయాలు జరుగుతున్నాయని, రెమ్‌డెసివిర్, ఫావిపిరవిర్ లాంటి ధృవీకరణ లేని మందులను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

అత్యవసరమైన పరిస్థితుల్ల్లో మాత్రమే వీటిని వాడాలనే నిబంధనను పిటిషనల్ ముందు తెలియజేశారు. అదేవిధంగా రెమ్‌డెసివిర్ కొవిడ్-19 బాధితులపై సమర్థవంతంగా పనిచేయలేదనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. కొవిడ్ మందులని పేర్కొంటూ విక్రయిస్తున్న 10 ఫార్మా కంపెనీలపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన కోర్టు నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ నోటీసులు ఇచ్చింది. కాగా, రెమ్‌డెసివిర్, ఫావిపిరవి్‌లను కొవిడ్-19 చికిత్సకు మందులుగా పేర్కొనలేదని కేంద్రం చెబుతోంది.

Next Story

Most Viewed