అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ వివాదంలో మరో కీలక పరిణామం

by  |
అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ వివాదంలో మరో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతకాలంగా కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ వివాదంలో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందాన్ని ‘యథాతథ స్థితి’లోనే కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమెజాన్ చెసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధించి ఫ్యూచర్ రిటైల్ గ్రూప్, సంస్థ అధినేత కిషోర్ బియానీ సహా ఇతరులకు కోర్టు నోటీసులను ఇచ్చింది.

మరో మూడు వారాల్లోగా సమాధానం చెప్పారని కోరింది. అలాగే, ఈ కేసు విచారణను ఐదు వారాల తర్వాత చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. అదేవిధంగా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. కాగా, ఈ నెల మొదటివారంలో ఢిల్లీ హైకోర్టు రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ రూ .24,713 కోట్ల ఒప్పందంపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీనిపై అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సోమవారం నాటి తీర్పుతో రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి మరోసారి అడ్డంకులు ఏర్పడ్డాయి.


Next Story

Most Viewed