తెలివైన వ్యూహంతో లాక్‌డౌన్‌ ఎత్తేయాలి.. ఎస్‌బీఐ నివేదిక!

by  |
తెలివైన వ్యూహంతో లాక్‌డౌన్‌ ఎత్తేయాలి.. ఎస్‌బీఐ నివేదిక!
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనాను నిలువరించేందుకు విధించిన లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగిస్తే వృద్ధిపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని, కోలుకోలేని వృద్ధి పతనానికి అడ్డుకట్ట వేయడానికి ఇంటిలిజెంట్ లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్ అమలు అవసరమని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. భారత జీడీపీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయి 4.2 శాతంగా ఉందని, చివరి త్రైమాసికంలో 3.1 శాతానికి దిగజారిందని వెల్లడించింది. లాక్‌డౌన్ ఎత్తేయడానికి తెలివైన వ్యూహాన్ని అనుసరించాలని ఎస్‌బీఐ పేర్కొంది. లాక్‌డౌన్‌ను దీర్ఘకాలం కొనసాగిస్తే వృద్ధి రేటు పతనాన్ని అడ్డుకోవడం ఆలస్యమవుతుందని వెల్లడించింది. ఆర్థిక మాంద్యం నుంచి కోలుకోవడం అంత సులభమైన పనికాదని, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి కనీసం 5 నుంచి 10 ఏళ్ల సమయం పట్టొచ్చని వివరించింది. ప్రస్తుతం జీవనం, జీవనోపాధిపై చర్చ జరుగుతోందని, ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ తెలివిగా ఎత్తేయాలని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. గతంలో వచ్చిన మాంద్యంలతో పోలిస్తే ఈసారి కోలుకోవడానికి కొంత ఆలస్యమవుతుందని వివరించింది. ప్రస్తుతం వ్యవసాయ రంగం మాత్రమే సానుకూలంగా ఉందని ప్రస్తావించింది.



Next Story

Most Viewed