ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం..

by  |
state bank of india news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు రెండు గంటల పాటు యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలకు అంతరాయం ఉంటుందని తెలిపింది. సాంకేతిక సమస్యలు, నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగా ఈ అంతరాయం ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వివరించింది. మే నెలలో సైతం ఎస్‌బీఐ ఇవే కారణాలతో రెండు గంటల పాటు అన్ని రకాల సేవలను నిలిపేసింది. కాగా, గతేడాది చివరి నాటికి ఎస్‌బీఐ వినియోగదారుల్లో 8.5 కోట్ల మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగిస్తున్నారు. 1.9 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్‌లలో 3.45 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఉన్నారాని, వీటిలో సగటున 90 లక్షల మంది రోజుకు ఒక్కసారైన ఎస్‌బీఐ యాప్‌ను వాడుతున్నట్టు బ్యాంక్ వెల్లడించింది.

Next Story

Most Viewed