సీఎం, ఎంఐఎం, డీజీపీ, ఎన్నికల కమిషన్‌ ప్లాన్

by  |
సీఎం, ఎంఐఎం, డీజీపీ, ఎన్నికల కమిషన్‌ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికలు ముఖ్యమంత్రి డైరెక్షన్‌లోనే జరిగాయని, సీఎం, ఎంఐఎం, డీజీపీ, ఎన్నికల కమిషన్ లు కూర్చుని మాట్లాడుకుని ఎన్నికలను నిర్వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం గ్రేటర్ ఎన్నికల అనంతరం ఆయన ఆ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఎన్నికల అధికార యంత్రాంగం ఓటింగ్ శాతాన్ని తగ్గించిందని, అడుగులకు మడుగులు ఒత్తిన ఎన్నికల సంఘానికి హాట్సాప్ చెబుతున్నాం అని ఆయన విమర్శించారు. ఓటర్లను చైతన్య పరిచి, అవగాహన కలిగించి ఓటింగ్ లో పాల్గొనేలా చేయాల్సిన ఎన్నికల సంఘం.. ఓటింగ్ శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని బండి సంజయ్ అసహనాన్ని వ్యక్తం చేశారు.

అధికార పార్టీ దౌర్జన్యం, రౌడీయిజం

ఎమ్మెల్యే అయి ఉండి కూడా బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం బాధాకరమని, ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి పైసలు పంచుతుంటే పోలీసులు అడ్డుకునే ప్రయ త్నం చేయలేదని సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి కారు మీద వ్యక్తి ఉన్నప్పటికీ కారును వేగంగా తీసుకెళ్లారని, పోలీసులు ఏ మేరకు భద్రత కల్పించారని ప్రశ్నించారు. బీజేపీ రౌడీయిజం చేయడం మొదలుపెడితే ఎమ్మెల్యే అయినా తగిన గుణపాఠం చెబుతామని హెచ్చిరించారు. ‘టి’న్యూస్ బూత్ చానెల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ రెండు పార్టీలే…

గ్రేటర్ లో విద్యంసాలు సృష్టించేవి ఎంఐఎం, టీఆర్ఎస్ అని బండి సంజయ్ ఆరోపించారు. గవర్నమెంట్ టీచర్లన ఎందుకు ప్రక్కన పెట్టారని ప్రశ్నించారు. సీపీఐ, సీపీఎం గుర్తులేమిటో ఎన్నికల కమిషన్ కు తెలియదంటే… ఆ కమిషన్ ఏ మేరకు అవగాహన ఉన్నదో అర్థం చేసుకోవాలని విమర్శించారు. గ్రేటర్ లో అనేక ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై ఎంఎల్ఏలు దాడిచేశారని ఆరోపించారు. సంఘటనలు జరిగిన చోట సీసీటివి ఫుటేజీ మార్చేందుకు ప్రయత్నం చేయడం సరికాదని, దానికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంజయ్ తెలిపారు.

Next Story

Most Viewed