కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక పెద్ద డ్రామా : సంపత్ కుమార్

by  |
కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక పెద్ద డ్రామా : సంపత్ కుమార్
X

దిశ, న్యూస్‌ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ ఉన్నది లేనట్లు..లేనివి ఉన్నట్లు పెద్ద డ్రామా కంపెనీలా ఉందని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఎద్దేవా చేశారు. సీఎం పదవి హుందాతనాన్ని దిగజార్చే విధంగా కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారని ఆయన అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ మాట్లాడిన విధంగా మేము కూడా మాట్లాడగలము కానీ, సంస్కారం అడ్డొచ్చి ఆ భాషను వాడలేక పోతున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులపై ఈ తరహా మాటలు మానుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి తక్కువ జోతిష్యునికి ఎక్కువగా కేసీఆర్ మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కరోనా టెస్టులు ఎక్కువ చేస్తే బహుమతి ఇస్తారా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమన్నారు. రైతుబంధు అమలుపై కేసీఆర్ నోటికొచ్చినట్లుగా అబద్ధాలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెబుతుంటే మంత్రులు మానసిక వేదనతో రగిలి పోతున్నారన్నారు. అడ్వకేట్‌లను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నట్లే జర్నలిస్టులకు కూడా ఎందుకు చేయడంలేదంటూ ఆయన ప్రశ్నించారు.

Tags: Kcr, press conference, Advocate, Journalists, Ktr, Sampath Kumar



Next Story

Most Viewed