గద్దెపై కొలువుదీరిన సమ్మక్క..

by  |
గద్దెపై కొలువుదీరిన సమ్మక్క..
X

మేడారంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న మహాఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో సమ్మక్కను భక్త జన సందోహం మధ్య గద్దెమీదకు తీసుకువచ్చారు. అమ్మవారికి మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతిరాథోడ్ లు ఘనస్వాగతం పలికారు. చిలకలగుట్టలో అమ్మవారికి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజల చేశారు. అనంతరం ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలికారు. అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో ఆదివాసీ పూజారులు పెద్ద ఊరేగింపుగా గద్దెమీదకు తీసుకురావడం ఆచారంగా వస్తోంది. ఆ సమయంలో పూజారులకు మూడెంచల భద్రతను కల్పిస్తారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, మధ్య సమ్మక్కను తీసుకువచ్చే మార్గంలో భక్తజనుల హర్షధ్వనాలు హోరెత్తుతాయి. సమ్మక్కను తీసుకువచ్చి గద్దెమీద ప్రతిష్టించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టు సమాచారం. కాగా గురువారం సమ్మక్క రానుందనే సమాచారంతో మేడారం అంతా లక్షలాది జనంతో నిండిపోయింది. కాలుతీసి వేసేంత స్థలం లేనంతగా మేడారం వీధులన్నీ జనజాతరను తలపిస్తున్నాయి.



Next Story