ఒకే మహిళ ‘ఫోటో’తో.. రెండు పార్టీల ప్రచారం.. చివరకు ఏమైందంటే..

by  |
ఒకే మహిళ ‘ఫోటో’తో.. రెండు పార్టీల ప్రచారం.. చివరకు ఏమైందంటే..
X

దిశ, వెబ్ డెస్క్ : త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ తమిళనాట రాజకీయ వాతావరణం వేడెక్కెతోంది. డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన ప్రచార పోస్టర్లలో ఒకే మహిళా ‘ఫొటో’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తిరుచ్చిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రచారానికి చీర ధరించిన ఓ మహిళ ఫొటోను వాడారు.

అనంతరం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అన్నాడీఎంకే అదే మహిళా ఫోటోను పోస్టర్‌లో ఉపయోగించింది. ఈ నేపథ్యంలో మరోసారి అధికార పార్టీ తమ ఫొటోలను కాపీ కొట్టిందని డీఎంకే ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే స్పందిస్తూ.. ఇంతకు ముందే ఆ ఫొటోలను తమ ప్రభుత్వ ప్రకటనలలో వాడినట్టు తెలిపింది. అయితే ఆ ఫొటోలు షట్టర్​ స్టాక్​ అనే వెబ్​సైట్​లోనివని చివరికి తేలింది. రెండు పార్టీలు ఈ వెబ్​సైట్​ నుంచి ఒకే మహిళ ఫొటోను పోస్టర్లలో ఉపయోగించినట్టు తెలిసింది.

Next Story

Most Viewed