కేటీఆర్ ట్వీట్‌పై సామ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెట్టింట వైరల్

164

దిశ, వెబ్‌డెస్క్ : సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.  తన స్నేహితలతో ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన మెమరబుల్ మూమెంట్స్‌ను  అభిమానులతో పంచుకుంటుంది. ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సామ్ ఎప్పటిలానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తారు. అయితే విడాకుల తర్వాత సమంత ఏ చిన్న ట్వీట్ చేసిన తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో సామ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

రైతు చట్టాల రద్దుపై శనివారం కేసీఆర్ బీజేపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చనిపోయిన‌ ప్రతి రైతు కుటుంబానికి 25 ల‌క్షల పరిహారం, రైతుల‌పై న‌మోదైన కేసుల‌ ఎత్తివేత, క‌నీస మ‌ద్దతు ధ‌ర చ‌ట్టం తీసుకురావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సమంత స్పందిస్తూ .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందిచదగినదని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నట్లు దండం పెట్టిన ఏమోజీని పెట్టి ట్వీట్‌ చేసింది సామ్. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌‌గా మారింది.

https://twitter.com/Samanthaprabhu2/status/1462296323059638280?s=20