కొత్త ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న టీవీలు

by  |
కొత్త ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న టీవీలు
X

దిశ ప్రతినిధి,హైద‌రాబాద్: రెండేళ్లుగా టెలివిజన్ మార్కెట్లో చాలా పెద్ద మార్పు కనిపించింది. కొన్నేళ్లుగా టీవీ మార్కెట్ చాలా దారుణంగా ఉండి తిరోగమనం చూసిన తరువాత ఇప్పుడు టీవీ మార్కెట్ బాగా పెరుగుతోంది. అంతే కాకుండా టీవీల అమ్మకాలు కూడా పెరిగాయి. పేద‌, ధ‌నిక ప్రజ‌ల బ‌డ్జెట్‌కు త‌గ్గట్లుగా మార్కెట్లో టీవీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాత త‌రం టీవీల‌కు కాలం చెల్లింది. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక టెక్నాల‌జీ క‌లిగి ఉన్న ఎల్ఈడీ టీవీల అమ్మకాలు ఊపందుకున్నాయి. సుమారు 30 ఏండ్లకు ముందు టీవీలు క‌లిగి ఉన్న వారు చాలా అరుదు. అయితే నేడు ప‌రిస్థితులు మారాయి. బ్లాక్ అండ్ వైట్ టీవీల స్థానంలో క‌ల‌ర్ టీవీలు వ‌చ్చాయి. సుమారు 20 ఏళ్ల పాటు వీటి హ‌వా కొన‌సాగింది. తాజాగా ఇవి కూడా క‌నుమ‌రుగై పోయాయి. వీటి స్థానంలో స్మార్ట్, అండ్రాయిడ్ టీవీలు అందుబాటులోకి వ‌చ్చాయి.

ధ‌ర‌ల ప్రభావం..

సుమారు ఇరవై ఏళ్ల క్రితం మార్కెట్లోకి వ‌చ్చిన టీవీల ధ‌ర‌లు అంద‌రికీ అందుబాటులో ఉండేవి కావు. దీంతో ప్రజ‌లు టీవీలు కొనేందుకు అంత‌గా ముందుకు వ‌చ్చే వారు కాదు. అయితే ఇప్పటి ప‌రిస్థితుల‌లో స‌గ‌టు మ‌నిషి ఆదాయం పెరిగింది. దీనికి తోడు ప‌లు ర‌కాల సైజుల‌లో టీవీలు అందుబాటులోకి వ‌చ్చాయి. అంతే కాకుండా ప్రతీ ఒక్కరికి వారి బ‌డ్జెట్‌లో అనుకూలంగా అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న టీవీలు మార్కెట్ల లోకి రావ‌డంతో వాటిని కొనేందుకు ముందుకు వ‌స్తున్నారు.

వాయిస్ సెర్చ్ లు

ఒక‌ప్పుడు టీవీల‌లో ఎలాంటి సౌక‌ర్యాలు ఉండేవి కావు. కేవ‌లం వాటిల్లో వ‌చ్చే కార్యక్రమాల‌ను మాత్రమే వీక్షించేవారు. సాంకేతిక ప‌రిజ్ఞానం పెరిగి పోయి నేటి టీవీల‌లో ఎన్నో ఆఫ్షన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. రిమోట్ బ‌ట‌న్ ను నొక్కి ప‌ట్టి మ‌న‌కు కావాల్సిన ప్రోగ్రాం చెబితే అది టీవీ తెర‌పై కనిపిస్తుంది. అంతేకాకుండా అమెజాన్, నెట్ ప్లిక్స్ , యూ ట్యూబ్, ఆహా , హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ వంటి ఎన్నో ర‌కాలుగా ప్రోగ్రామ్ లు చూడ‌వ‌చ్చు. ప్రతి నిత్యం ప‌లు ఛానెళ్లలో వ‌చ్చే సీరియ‌ల్స్ కూడా ఇష్టమొచ్చిన స‌మ‌యంలో చూసే అవ‌కాశం ఉంది.

స్మార్ట్ టీవీలు..

మారిన ప‌రిస్థితుల‌లో మార్కోట్లో స్మార్ట్ టీవీలు ప్రాచుర్యం పొందాయి. ధ‌ర‌లు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉ న్నాయి. స్మార్ట్ టీవీ వాటి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. స్మార్ట్ టీవీలు వెబ్ ఓఎస్ , టిజెన్ హోమ్‌ఓఎస్ లేదా కొన్ని కస్టమ్ లూనిక్స్ ఆధారిత ఓఎస్ లతో రన్ అవుతాయి. ఈ స్మార్ట్ టీవీలను వేరుచేసేది కేవలం అన్ని రకాల యాప్ లభ్యత కాగా స్మార్ట్ టీవీలలో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమె జాన్ ప్రైమ్ వీడియో వంటి మరిన్ని ప్రసిద్ధ యాప్ లు అందించే కార్యక్రమాలు వీక్షించ‌వ‌చ్చు. ఓటీటీ యాప్ లు, వాటి సభ్యత్వంతో కావలసినప్పుడు ఇష్టమైన టీవీ షోలు మూవీలను చూసే అవ‌కాశం ఉంది. వాస్తవానికి స్మార్ట్ టీవీలలో ఎటువంటి సమస్య లు లేకుండా కంటెంట్‌ ను ప్రసారం చేయగలగడానికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అవుతుంది.

ఆండ్రాయిడ్ టీవీలు

ఆండ్రాయిడ్ టీవీలు కూడా స్మార్ట్ టీవీ లాగే ఉంటా యి కానీ చిన్న తేడా ఏమిటంటే ఇవి ఆండ్రాయిడ్ ఓఎస్‌తో రన్ అవుతాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ లో టీవీ రన్ అయేటప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆండ్రాయిడ్ ఓఎస్‌ ద్వారా గూగుల్ అసిస్టెంట్‌కు యాక్సిస్ పొందవచ్చు. అంటే ఆండ్రా యిడ్ టీవీలను కంప్యూటర్ మాదిరిగా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఛానెల్‌లను మార్చడం, వాల్యూమ్ పెంచడం లేదా తగ్గించడం వంటి ఫంక్షన్ల కోసం వాయిస్ ఆదేశాలను ఇవ్వవచ్చు. దీని ద్వారా వాతావరణ సమాచారం, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, జోక్స్ వంటివి మరెన్నో తెల్సుకోవచ్చు. అండ్రాయిడ్ టీవీలో ఉన్న ప్లే స్టోర్ నుంచి అన్ని రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా యాక్సిస్ పొందవ‌చ్చు. వీటిలో ప్లే మూవీస్, ప్లే మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూ ట్యూబ్, స్పాటిఫై, ట్విట్టర్ వంటి యాప్స్ ఉన్నాయి.

Next Story

Most Viewed