ఇక బస్ స్టేషన్లలో ‘తల్లి’కి గౌరవం.. సజ్జనార్ కీలక నిర్ణయం

by  |
Sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని ప్రజా రవాణా ఆర్టీసీ ప్రస్తుతం ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందుతూ నష్టాల నుంచి లాభాల బాటలో సాగుతోంది. గత రెండు, మూడేళ్లుగా నష్టాల్లో కూరుకుపోయి, ఆర్టీసీ నడిపించలేమని ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి నుంచి కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తే ఆర్టీసీని అభివృద్ధి చేయొచ్చని ఎండీ సజ్జనార్ నిరూపిస్తున్నారు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులతో పాటు కార్మికుల బాగోగులు చూస్తూ దిగ్విజయంగా ఆర్టీసీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో ‘‘మిల్క్ ఫీడింగ్ రూమ్’’ లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అతిపెద్ద బస్ స్టేషన్ ఎంజీబీఎస్‌లో సజ్జనార్ ప్రారంభించారు. ఈ క్రమంలో వీటిని అన్ని బస్ స్టేషన్లలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేందుకు మహిళలు ఇబ్బంది పడేవారు. కానీ, ఇక ఆ ఇబ్బందులు ఉండవంటూ నెటిజన్లు సజ్జనార్‌కు ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెబుతున్నారు.

Next Story