మెట్రోలో ‘కింద కూర్చున్న తల్లి’.. స్పందించి సజ్జనార్ ఏం చేశారంటే.?

1048
MD sajjanar

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లోని మెట్రోలో ఓ మహిళ కింద కూర్చున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మనుషుల్లో మానవత్వం తగ్గిపోయిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తనదైన శైలిలో స్పందించారు.

ఈ సందర్భంగా ట్వీట్‌లో ‘‘అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం మన #TSRTC బస్సు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేద్దాం. నైతిక విలువలను పెంచుకుందాం.’’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఎంతో అర్థాన్ని ఇచ్చేలా ఈ వీడియోలో ‘‘బస్సు ప్రయాణిస్తుండగా.. మొదటగా వృద్ధురాలు రాగా.. వేరే వారు లేచి నిలబడి ఆమెకు సీటు ఇస్తారు. తర్వాత చిన్నారితో బస్సు ఎక్కిన మహిళ, వికలాంగురాలు, గర్భిణీ ఇలా బస్సు ఎక్కిన వారికి.. పురుషులు, స్త్రీలు అన్న తేడా లేకుండా స్వతహాగా సీటు ఇచ్చేశారు.’’

ఇలా అవసరమైన వారికి సీటు ఇచ్చి గౌరవించడం కేవలం ఆర్టీసీలోనే సాధ్యమని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆర్టీసీలో ప్రయాణించాలని కోరారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..