టిష్యూలు పెట్టుకుని ఆడిన సచిన్

by  |
టిష్యూలు పెట్టుకుని ఆడిన సచిన్
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఒక మతమైతే సచిన్ దేవుడు అని ఒక స్లోగన్ ఉంది. క్రికెట్‌కు సచిన్ సేవలను ఒక్క వాక్యంలో చెప్పాలంటే దాన్ని ఉపయోగిస్తే చాలు. డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత దిగ్గజ బ్యాట్స్‌మాన్‌గా పేరొందిన ఈ క్రికెట్ లెజెండ్ ఆటకు ఎంతగా అంకితమయ్యాడో చెప్పాలంటే ఈ సంఘటన వివరించాలి. సౌత్‌ఆఫ్రికాలో 2003లో ప్రపంచకప్ జరిగింది. ఆ మెగా టోర్నీలో సచిన టెండుల్కర్ 674 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన సచిన్ ఒక దశలో తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డాడు. చాలా కాలంపాటు ఆ విషయం బయటకు తెలియరాలేదు. కానీ, సచిన్ బయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో ఈ విషయం తెలియజేశారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సమయంలో కండరాలు పట్టివేయడంతో బాధను దిగమింగుకుంటూనే 98 పరుగులు చేసి విజయం అందించాడు. ఆ మ్యాచ్‌లో బాగా అలసిపోవడంతో అతడు తర్వాత మ్యాచ్‌లోపు కోలుకునేందుకు ద్రవ పదార్థాలు బాగా తాగాడు. దీంతో అతడికి నీళ్ల విరేచనాలు మొదలయ్యాయి. ఎనర్జీ డ్రింక్స్‌లో ఉప్పు కలుపుకొని తాగినా పరిస్థితి మారలేదు. అయినా సరే లంకతో మ్యాచ్ ఆడాలనే సచిన్ నిర్ణయించున్నాడు. అండర్‌వేర్‌లో టిష్యూలు పెట్టుకొని బ్యాటింగ్ చేశాడు. అలా ఇబ్బంది పడుతూనే డ్రింక్స్ సమయంలో డ్రెస్సింగ్ రూంకి వెళ్లి శుభ్రం చేసుకొని వచ్చే వాడంటా. ఆ మ్యాచ్‌లో సచిన్ 97 పరుగులు చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఆట పట్ల సచిన్ అంకితభావం ఎలా ఉంటుందో ఈ ఒక్క ఉదహరణ చాలు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సంఘటనను మరోసారి పంచుకున్నాడు.

Next Story

Most Viewed