ఎల్బీనగర్‌ జెడ్సీగా బాధ్యతలు స్వీకరించిన పంకజ

266
ZC Pankaja

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా ఎస్‌.పంక‌జ గురువారం ఈస్ట్ జోన్ జోన‌ల్ కార్యాల‌యంలో బాధ్యత‌లు చేప‌ట్టారు. GHMCలో జోన‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీలు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ప్రధాన కార్యాల‌యంలో ఎన్నిక‌ల విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న ఎస్‌.పంక‌జ‌ను తొలుత కూక‌ట్‌ప‌ల్లికి బ‌దిలీ చేశారు. అనంత‌రం జ‌రిగిన రాజ‌కీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ జీవోను స‌వ‌రించి ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ చేశారు. మారిన ప‌రిణామాల‌తో బుధ‌వారం బాధ్యతలు చేప‌ట్టాల్సిన జెడ్సీ పంక‌జ‌, అనూహ్య రీతిలో గురువారం ఎల్బీన‌గ‌ర్ జోనల్ క‌మిష‌న‌ర్‌గా బాధ్యత‌లు స్వీక‌రించారు. ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా విధులు నిర్వహించిన ఉపేంద‌ర్‌రెడ్డిని న‌ల్లగొండ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..