మద్యం కావాలా?… వాటితో వస్తేనే మద్యం: తెనాలి సీఐ

by  |
మద్యం కావాలా?… వాటితో వస్తేనే మద్యం: తెనాలి సీఐ
X

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో సుదీర్ఘ విరామానంతరం మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ఏపీలో కోలాహలం మొదలైంది. ఎక్కడ మద్యం దుకాణం ముందు చూసినా చాంతాడంత క్యూ లైన్లు కనువిందు చేస్తున్నాయి. 75 శాతం ధరలు పెంచినా మందుబాబుల ఉత్సాహానికి అడ్డుకట్ట పడలేదు. భౌతిక దూరాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో తెనాలి సీఐ కొత్త రూల్ తీసుకొచ్చారు.

తెనాలిలో మద్యం కావాలంటే ఆధార్ కార్డు, గొడుగు తప్పని సరి అని సీఐ హరికృష్ణ స్పష్టం చేశారు. దీంతో మద్యం కావాల్సివారు గొడుగు, ఆధార్ తీసుకుని వస్తున్నారు. గొడుగు కారణంగా భౌతిక దూరం పాటించేందుకు ఆయన ఈ నిబంధన తీసుకొచ్చారు. అంతే కాకుండా ఎండబారి నుంచి రక్షణకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మద్యం కోసం దూరాభారాలు, మండే ఎండలను సైతం మందుబాబులు లెక్కచేయడం లేదు.

దీంతో ఆధార్ కారణంగా ఎవరు ఎక్కడి నుంచి మందుకు వచ్చారన్న స్పష్టత ఉంటుందని ఆయన వివరించారు. దీంతో రద్దీని నియంత్రించవచ్చని ఆయన చెప్పారు. గొడుగు సామాజిక దూరం పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఇవే నిబంధనలని ఆయన చెప్పారు.

Tags: tenali, guntur district, tenali ci, harikrishna, liquor rules

Next Story

Most Viewed