తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్ల ‘దళిత బంధు’ నిధులు విడుదల

by  |
GO
X

దిశ,తుంగతుర్తి: దళిత బంధు పథకం కింద తిరుమలగిరి మండలానికి రూ.50 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ నిధులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమ చేసినట్లు ఉత్తర్వులు వెలుబడ్డాయి. ముఖ్యంగా దళిత బంధు పథకం కింద రాష్ట్రంలో తొలిసారిగా నాలుగు మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం ఎంపికయింది. ఈ మేరకు అప్పట్లో తిరుమలగిరి మండలంలో దళిత కుటుంబాలు ఎన్ని అనే అంశంపై సర్వేలు చేశారు. అయితే మండలంలో ఎంత మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తిరుమలగిరి మండలాలనికి రూ.50 కోట్లు మంజూరు కాగా, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని చారకొండ మండలానికి రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story