మెడికల్ మాఫియా.. కరోనా టెస్టుకు రూ.2 వేలు

by  |
మెడికల్ మాఫియా.. కరోనా టెస్టుకు రూ.2 వేలు
X

దిశ నాగర్ కర్నూల్: కరోనా సెకండ్ వేవ్ సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ప్రైవేట్ మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ర్యాపిడ్ కిట్లను సైతం తమ వశం చేసుకుని ప్రైవేటు వ్యక్తులు దందా చేస్తున్నారు. ‘ఫోన్ కొట్టు.. టెస్ట్ చేయించుకో’ అనే పద్దతిలో వేల సంఖ్యలో కిట్లు వెంటేసుకుని ఇంటి వద్దే టెస్టులు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఉదంతం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరుగుతుంది. అయినా జిల్లా ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కారోనా టెస్టులకోసం రోజుల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా కలగని భాగ్యం రెండు వేలు ఇస్తే ఇంటివద్దే కలుగుతోంది.

స్వల్ప లక్షణాలు వచ్చిన టెస్టులు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా.. టెస్టింగ్ కేంద్రాల్లో కిట్లు లేవనే సాకుతో 60 మందికి మించి టెస్ట్ చేయడం లేదు. కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వేల సంఖ్యలో కిట్లు ఎలా వెళ్లాయని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరుగుతోందని బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.



Next Story