సీఎం కీలక నిర్ణయం.. 100% వ్యాక్సినేషన్ చేసిన గ్రామానికి 10లక్షలు..

by  |
సీఎం కీలక నిర్ణయం.. 100% వ్యాక్సినేషన్ చేసిన గ్రామానికి 10లక్షలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ సాధించిన గ్రామాలకు రూ.10లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి గ్రాంటును మంజూరు చేయనున్నట్లు సీఎం కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, పంజాబ్‌లో ఇప్పటి వరకు 5,04,586 కరోనా కేసులు నమోదు కాగా, 12,086 మంది కరోనాతో చనిపోయారు.



Next Story