ఖేల్‌రత్నతో రోహిత్ సరికొత్త రికార్డు..

by  |
ఖేల్‌రత్నతో రోహిత్ సరికొత్త రికార్డు..
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith sharma)కు కేంద్ర క్రీడాశాఖ రాజీవ్ ఖేల్ రత్న (Rajeev khel ratna award) అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రోహిత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక క్రికెటర్ పూర్తి స్థాయి కెప్టెన్ కాకముందే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి.

రోహిత్ కంటే ముందు సచిన్ టెండుల్కర్ (Sachin tendulker) (1998), మహేంద్ర సింగ్ ధోనీ (Mahender singh dhoni) (2007), విరాట్ కొహ్లీ (Virat kohli) (2018) కెప్టెన్లుగా అయ్యాకే ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు పలు మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు తప్ప ఇంత వరకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించలేదు. దీంతో కెప్టెన్ కాకముందే ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి క్రికెటర్‌ (First cricketer) గా సరికొత్త రికార్డు సృష్టించాడు. త్వరలో ఐపీఎల్ (Ipl) ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ జట్టుతో కలసి యూఏఈ చేరుకున్నాడు.

Next Story

Most Viewed