ఓకే.. కానీ, అప్పటివరకు కోల్పోయే ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు..?

by  |
Road-1
X

దిశ, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలోని కాటాయిగూడెం, చిన్న అర్లగూడెం గ్రామశివారులో ప్రధాన రహదారులపై ఉన్న కల్వర్టుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ములకపాడు నుంచి మారాయిగూడెం వరకు నిత్యం వందలాది వాహనాల్లో ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. ఈ దారిలో మూలమలుపులు ఉండడం, చెట్లు ఏపుగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడం, అదే స్థలంలో కల్వర్టులు దెబ్బతిని రెయిలింగ్ పడిపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రివేళలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

Road-2

కాటాయిగూడెం, చిన్నార్లగూడెం గ్రామ శివారు కొంగవాగు కల్వర్టుల వద్ద ఇలా ప్రమాదాలు జరిగి చాలామంది మృతి చెందారు. ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్న ఈ కల్వర్టు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోవడంలేదు. లక్ష్మీనగరం నుంచి లక్ష్మీపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పాలనపరమైన అనుమతులు మంజూరు కాలేదు. అయితే డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టే సమయంలోనే ఈ కల్వర్టుల నిర్మాణం చేపట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. కానీ, అప్పటివరకు జరిగే ప్రమాదాల వల్ల కోల్పోయే ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి కల్వర్టుల మరమ్మతులు చేపట్టి ప్రజలకు రక్షణగా నిలవాలని వారు కోరుతున్నారు.

Next Story

Most Viewed