హీరోలను మెప్పించిన అవ్వ

by  |
హీరోలను మెప్పించిన అవ్వ
X

లాక్‌డౌన్ చాలా మందికి పని లేకుండా చేసింది. ఉపాధి కరువై పస్తులుండేలా చేసింది. దీంతో జనం కొత్త ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. జీతాలు లేక కొందరు టీచర్లు కూరగాయలు, పండ్లు అమ్ముకుని బతుకుతుంటే.. ఒక ముసలమ్మ తనకు తెలిసిన విద్యను రోడ్డుపై ప్రదర్శిస్తూ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసింది. కర్ర సాముతో స్టంట్స్ చేస్తున్న ఓ అవ్వ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ వీడియోను రితేష్ దేశ్‌ముఖ్ తన ఎకౌంట్‌లో పోస్ట్ చేసి, ఆజి మా అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ వయసులో తనకు వచ్చిన పనిని ప్రదర్శిస్తూ పొట్ట కూటి కోసం తిప్పలు పడుతున్న అవ్వ వివరాలు తెలుసుకుని.. తన బాగోగులు చూసుకునేందుకు ముందుకొచ్చారు. తన స్టోరీ తెలుసుకున్నానని.. చాలా గొప్పగా ఉందని తెలిపాడు.

కాగా, ఈ వీడియో చూసి ఫిదా అయిన రియల్ హీరో సోనూసూద్ అవ్వతో ఒక్క స్కూల్ నడిపించాలని ఉందని తెలిపాడు. తన నుంచి మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. అవ్వ వివరాలు తెలిసిన వారు తనకు షేర్ చేయాలని కోరారు.

Next Story

Most Viewed