రిషబ్ ఇంకో పదేళ్లు ఆడుతాడు: కిరణ్ మోరే

by  |
రిషబ్ ఇంకో పదేళ్లు ఆడుతాడు: కిరణ్ మోరే
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా తరపున మూడు ఫార్మాట్లలో రిషబ్ పంత్ మరో 10 ఏళ్ల పాటు ఆడతాడని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే జోస్యం చెప్పారు. ఒక క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ గురించి చెప్పుకొచ్చారు. ‘క్రికెట్ ఎప్పుడూ బ్యాట్స్‌మెన్ గేమ్. కాబట్టి కేవలం వికెట్ కీపర్‌గానే ఉంటానంటే కుదరదు కాబట్టి కీపర్ బ్యాట్స్‌మాన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టెస్టుల్లో వృద్దిమాన్ సాహ బదులు ప్రస్తుతం రిషబ్ పంత్‌ను పరుగులు చేస్తున్నాడనే తీసుకున్నారు. బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నా కీపింగ్‌లో కొన్ని పొరపాట్లు చేస్తున్నాడు. టీమ్ ఇండియాకు ఒక హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ ఉన్నారు. అలాగే ఒక వికెట్ కీపింగ్ కోచ్ కూడా అవసరం. కీపర్‌కు కొన్ని బలహీనతలు ఉంటాయి. వేర్వేరు పిచ్‌లపై ఆడినప్పుడు.. బంతి వచ్చే విధానం కూడా మారుతుంది. దానికి అనుగుణంగా కీపర్‌ను తీర్చిదిద్దే కోచ్ ఉండాలి. ఇక ప్రస్తుత ఫామ్ చూస్తుంటే రిషబ్ పంత్ మరో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉన్నది’ అని కిరణ్ మోరే చెప్పారు.

Next Story

Most Viewed