సర్కస్‌లా ఉంది.. 'మా' వివాదంపై ఆర్జీవీ సెటైర్

by  |

దిశ, సినిమా: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎలక్షన్ ఫలితాలు ముగిసేంతవరకూ నటీనటుల మధ్య మాటలు సాధారణ రాజకీయాలను తలపించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ‘మా’లో జరుగుతున్న తాజా పరిణామాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించాడు. ‘మా’లోని మొత్తం వ్యవహారం చూస్తుంటే సర్కస్‌ని తలపించేలా ఉందంటూ తన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. లోకల్‌, నాన్‌లోకల్‌ అనే అంశం నుంచి ప్రారంభమై, వ్యక్తిగత ఆరోపణలు, సినిమా బడ్జెట్లు, అవార్డులంటూ ఒకరిపై ఒకరు కీలక ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. నిన్న జరిగిన అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలోనూ పలువురు నటులు ప్రత్యర్థి ప్యానెల్‌, వారి మద్దతుదారులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

https://twitter.com/RGVzoomin/status/1449432354523533319

Next Story