విద్యుత్ ఉద్యోగుల జీతాల కోతల్లో మార్పు

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కిందిస్థాయి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎమ్) సిబ్బందికి మే నుంచి ఫుల్ జీతాలు అందనున్నాయి. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో 24గంటల విద్యుత్ అందించడానికి కృషి చేస్తున్న విద్యుత్ శాఖ ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి ఈ నెల నుంచి జీతాల్లో ఎలాంటి వాయిదాలు ఉండవని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విద్యుత్ సిబ్బందికి గత నెల విధించిన జీతాల కోతల్లో సవరణలు చేస్తూ ట్రాన్స్‌కో ఎండీ ప్రభాకర్ రావు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు పే డ్రాయింగ్ ఆఫీసర్లు పాటించాలని సూచించారు. వీటి ప్రకారం క్లాస్ ఫోర్, జౌట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్టిజన్స్‌కు 10 శాతం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందికి 50 శాతం మార్చి నెల వేతనంలో కోత విధించారని, వచ్చే నెల నుంచి వీరి వేతనాల్లో ఎలాంటి కోతల్లేకుండా ఫుల్ జీతం ఇస్తారని పేర్కొన్నారు. క్లాస్ 3 అండ్ అబోవ్ ఉద్యోగులకు పెన్షన్‌లో గతంలో 50 శాతం కోత విధించగా వచ్చే నెల నుంచి వీరికి 25శాతం మాత్రమే కోత విధించనున్నారు. క్లాస్ 4 ఉద్యోగులకిచ్చే పెన్షన్లలో గతనెల పెట్టిన 10 శాతం వేతన కోతలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. ఆల్ ఇండియా సర్వీసు అధికారులకు 60శాతం, డైరెక్టర్, ఓఎస్డీలు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు50 శాతం విధించిన కోతల్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు గతంలోనూ ఇప్పుడు ఎలాంటి వేతనాల కోతలు లేవని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

tags : telangana, transco, kcr, employees, salary revision.



Next Story