బీసీ జంగ్ సైరన్‌కు రేవంత్ రెడ్డి మద్దతు

by  |
బీసీ జంగ్ సైరన్‌కు రేవంత్ రెడ్డి మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ లో తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలు చేస్తున్న ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. జంతర్ మంతర్ లో బీసీలు ధర్నా చేస్తుంటే వారికి సంబంధించిన తొమ్మిది మంది సన్యాసి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారంటే బడుగు బలహీన వర్గాల ఓట్ల ద్వారానే అని ధ్వజమెత్తారు. దేశ ప్రధాని బీసీలకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో బీసీల కుల లెక్కలు చేపట్టిందని, కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల బీసీ గణన సాధ్యం కాలేదని అన్నారు.

బీసీలలో కుల గణాంకాలు లెక్కించడం వల్ల బీసీ విద్యార్థులు ఉద్యోగాలు పొందే హక్కు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల జనాభా లెక్క పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed