మెట్రో‌లో ‘రేవంత్’ ఫ్యాన్స్ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్

by Anukaran |   ( Updated:2023-10-10 15:47:54.0  )
Revanth-Fabs
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం గాంధీ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న నేతగా రేవంత్‌కు మంచి గుర్తింపు ఉంది. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు మెట్రో రైలులో సందడి చేశారు. రేవంత్‌పై ఉన్న క్రేజ్‌తో కొందరు యూత్.. ఆయన ఫేస్ మాస్కులు ధరించి వీర లెవల్‌లో మాస్ స్టెప్పులు వేశారు. ఈ విధంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Next Story