సీనియర్లకు విశ్రాంత్రి.. భారత టెస్టు జట్టులోకి కొత్త కుర్రాళ్లు

by  |
new players
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ అనంతరం న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఆటగాళ్లకు జట్టులో అవకాశం దక్కింది. దీంతో జట్టులోకి శ్రేయస్ అయ్యర్, KS భరత్, ప్రసిద్ద్ కృష్ణలు సెలెక్ట్ అయ్యారు. నవంబర్ 25న కాన్పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు అజింక్య రహానే కెప్టెన్ కెప్టెన్ కాగా, పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెండో టెస్టుకి విరాట్ కోహ్లీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. సీనియర్ల రెస్ట్‌తో ఇలా కొత్త వాళ్లకు అవకాశం దొరకడం టెస్ట్ క్రికెట్ భవిష్యత్‌కు శుభ పరిణామం అని చెప్పవచ్చు.

మొదటి టెస్ట్‌కి భారత జట్టు:

అజింక్యా రహానే (కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ



Next Story

Most Viewed