గాలి ద్వారా కరోనా వ్యాప్తి: ఈటల కీలక వ్యాఖ్యలు

by  |
etela resignation
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా గాలి ద్వారా వ్యాపి చెందుతుందని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాధి పలానా కారణం చేత సోకుతుందని ప్రపంచంలో ఇంతవరకు ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టలేదని చెప్పారు. ప్రస్తుతం వస్తున్న వాదనలన్నీ అంచనాలు వేసి చెబుతున్నవి మాత్రమేనని తెలిపారు. కరోనా వ్యాధి కట్టడికి కేవలం స్వీయ నియంత్రణ మాత్రమే మార్గమని స్పష్టం చేశారు. ఆదివారం బిఆర్ కె భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ కూడా బెడ్ల కొరత లేదని, కొన్ని పెద్ద ఆస్పత్రులకు మాత్రమే రోగులు వెళుతుండటంతో.. ఆ ఆసుపత్రుల్లో మాత్రమే ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల కొరత ఏర్పడుతుందన్నారు.

10 బెడ్ల సౌఖర్యం ఉన్న అన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సలకు అనుమతులిచ్చామని కరోనా రోగులు ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. హైదరాబాద్ హెల్త్ హబ్ ఉండటంతో చికిత్సలు పొందేందుకు ఇతర రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారని చెప్పారు. చికిత్సలు పొందుతున్న వారిలో 50 శాతం మంది రోగులు ఇతర రాష్ట్రాల రోగులని తెలిపారు. రెమిడెసివిరి మందుల కొరత లేకుండా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టామన్నారు. డిమాండ్ తగినంత సప్లై చేయాల్సిందిగా ఫార్మా కంపెనీలను కోరామని చెప్పారు. రోగులకు ఇబ్బందులు లేకుండా రెమెడిసివిరి మందుల సప్లై కు ప్రత్యేకంగా కౌంటర్ లు ఏర్పాటు చేసి సరఫరా చేస్తామన్నారు. అనవసరమైన ప్రయాణాలు వేడుకలు మానుకోవాలని అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రధాని మోడీ తో జరిగిన సమావేశంలో 25 ఏళ్ళు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కోరినట్టు గా తెలిపారు.

కేంద్రం సరిపడా వ్యాక్సిన్ సప్లై చేస్తే రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆదివారం రాత్రికి 2.7 లక్షల డోసుల వ్యాక్సిన్ దిగుమతి అవుతుందన్నారు. పేషెంట్ల కు ప్రోటోకాల్ ప్రకారం చికిత్స లు చేయాలని అనవసర చికిత్సలు చేయవద్దని డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతం 260 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని తగినంత సప్లై చేయాల్సిందిగా కేంద్రాన్ని కొరని చెప్పారు. కరోనా సోకిన 95శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని కేవలం 5శాతం మంది మాత్రమే ఆసపత్రిలో చేరుతున్నరని వివరించారు. పట్టణంలోని కేసులు పెరుగుతుండటం తో అన్ని మున్సిపాలిటీల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ర్పె చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. రోగుల సంఖ్య పెరిగితే 300 నుంచి 350 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందన్నారు. రాష్ట్రనికి సరిపడినంత ఆక్సిజన్ ను సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.



Next Story

Most Viewed