రేణిగుంట టు ఢిల్లీ.. 9 కోట్ల లీటర్ల పాలు సరఫరా

by  |
Dudh Durantho Train
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేణిగుంట నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పాలను తరలించేందుకు రైల్వే శాఖ ‘దూద్ దురంతో’ రైలును గతేడాది జూలై 15 న ప్రారంభించింది. ఈ ప్రత్యేక రైలుకు ఆరు ట్యాంకర్లు ఉండగా ఒక్కో ట్యాంకర్ కెపాసిటీ 40 వేల లీటర్ల సామర్థం ఉంది. అంటే ఒక రైలులో 2.40 లక్షల లీటర్ల పాలను తరలించే అవకాశముంది.

గతేడాది నుంచి రోజు విడిచి రోజు ఆ రైలు తన సేవలను కొనసాగిస్తోంది. అయితే ఆదరణ పెరగడంతో ప్రతిరోజు సేవలు కొనసాగించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు 394 ట్రిప్పుల్లో 2248 ట్యాంకర్ల ద్వారా 9 కోట్ల లీటర్ల పాల సరఫరా జరిగినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా హర్షం వ్యక్తం చేశారు. పాలను సరఫరా చేయడంలో నిరంతర కృషి చేసిన గుంతకల్ డివిజన్, జోనల్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, అధికారులను ఆయన అభినందించారు.

Next Story

Most Viewed