1,000 పడకల ఆసుపత్రి నిర్మించనున్న రిలయన్స్ సంస్థ!

by  |
1,000 పడకల ఆసుపత్రి నిర్మించనున్న రిలయన్స్ సంస్థ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆరోగ్య రంగం ఒత్తిడిని ఎదుర్కొంటొంది. ఈ క్రమంలో కరోనా నియంత్రణకు సాయంగా దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిలయన్స్ ఫౌండేషన్ తరపున 1000 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రి నిర్మాణానికి ముందుకొచ్చింది. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జామ్‌నగర్‌లో దీన్ని నిర్మించనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు రిలయన్స్ సంస్థ ఈ ప్రకటన ఇచ్చింది. కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి సాయం చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రి కంపెనీలను కోరారు.

ఈ నేపథ్యంలోనే వచ్చే ఐదు రోజుల్లో 400 పడకల సౌకర్యం ఉన్న ఆసుపత్రి అందుబాటులోకి రానుందని ముఖేశ్ అంబానీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆ తర్వాత ఈ సామర్థ్యాన్ని 1000 పడకలకు పెంచనున్నట్టు వెల్లడించారు. ఈ ఆసుపత్రికి అవసరమైన వైద్యులను, నర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చనుంది. ఆసుపత్రిలో వినియోగించే వైద్య పరికరాలు, సామాగ్రి వంటి వాటిని రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ ఆసుపత్రిలో జామ్‌నగర్ ప్రాంతంలో కరోనా బారిన పడిన వారికి సేవలు ఉచితంగా అందుతాయని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed