రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖాతాలో మరో రికార్డు

by  |
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖాతాలో మరో రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 సంవత్సరం దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థకు కలిసొచ్చినట్టుగా మరే ఇతర కంపెనీకి కలిసి రాలేదు. ఏడాది ప్రారంభం నుంచే వారానికో రికార్డుతో దూసుకెళ్తోంది. తాజాగా మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే రిలయన్స్ అధినేత ప్రపంచ ధనికుల్లో ఐదవ స్థానాన్ని సంపాదించడంతో పాటు రిలయన్స్ షేర్ ధర జీవిత కాల గరిష్ట స్థాయికి చేరుకుంది. గురువారం షేర్ ధర మరింత పెరగడంతో సంస్థ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ. 13 లక్షల కోట్లను దాటేసింది.

ఈ మైలురాయితో భారత్‌లో భారీ మార్కెట్ క్యాప్ దక్కించుకున్న కంపెనీగా రిలయన్స్ సంస్థ నిలిచింది. గురువారం ఈక్విటీ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.80 శాతానికి పైగా లాభపడంతో షేర్ ధర రూ. 2060కి చేరుకుంది. కేవలం ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 12 లక్షల నుంచి రూ. 13 లక్షలను చేరుకోవడం గమనార్హం. డాలర్ పరంగా చూస్తే అంతర్జాతీయ కంపెనీ ఒరాకిల్ కార్పొరేషన్ మార్కెట్ క్యాప్ 171.9 బిలియన్ డాలర్లను అధిగమించి 173 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ రికార్డుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో 48వ స్థానాన్ని దక్కించుకుంది.

Next Story

Most Viewed