పల్లాకు టఫ్ ఫైట్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న.. ఈసారైనా గట్టెక్కేనా?

by GSrikanth |
పల్లాకు టఫ్ ఫైట్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న.. ఈసారైనా గట్టెక్కేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. మే 2వ తేదీన నోటిఫికేషన్, మే 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం, 27న పోలింగ్, జూన్ 5వ తేదీన కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే, 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడ్డారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా.. చివరకు పల్లా విజేతగా నిలిచారు. అయితే, ఈసారి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానం మల్లన్న పేరును కూడా అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిన ఈ మూడు జిల్లాల్లో జరిగే ఎన్నిక కావడంతో మల్లన్న సులువుగా బయటపడే అవకాశాలు కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా, ఇప్పటికే ఎన్నికల సంఘం పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఓటరు నమోదు కోసం నిర్ణీత షెడ్యూల్‌ను వెల్లడించి.. ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేసింది.

Next Story