అంబులెన్సుకు డబ్బుల్లేవ్.. బైక్‌పైనే మృతదేహం తరలింపు

by  |
అంబులెన్సుకు డబ్బుల్లేవ్.. బైక్‌పైనే మృతదేహం తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో హృదయ విదారకమైన ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇటువంటి దృశ్యాలు గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబ సభ్యులే వెనకడుగువేయడం, మృతదేహాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లడం.. డబ్బులిస్తేనే మృతదేహాలను ఖననం చేస్తానని చెప్పడం, తమతో ఎటువంటి సంబంధం లేని వారు చివరకు అంత్యక్రియలు జరపడం వంటి అనేక విషాద ఘటనలు కరోనా మహమ్మారి దయ వల్లే వెలుగులోకి వచ్చాయి.

తాజాగా మృతిచెందిన ఓ వృద్ధుడిని అంబులెన్సులో తరలించేందుకు డబ్బులు లేక బంధువులు ద్విచక్ర వాహనంపైనే శ్మశానానికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా మధిరలో వెలుగుచూడగా స్థానికంగా అందరినీ కలిచివేసింది. వివరాల్లోకివెళితే.. ఓ వృద్ధుడు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంబులెన్సుకు కాల్ చేయగా వారు అధిక డబ్బులు డిమాండ్ చేశారు. అయితే, బాధిత కుటుంబసభ్యులకు అంత స్తోమత లేకపోవడంతో బంధువులే దగ్గరుండి వృద్ధుడి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లారు. అటుగా వెళ్తున్న వారు గమనించి వారిని అడుగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


Next Story