పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ను రేఖ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా?

72

దిశ, స్పోర్ట్స్: బాలీవుడ్, క్రికెట్‌కు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఎంతో మంది క్రికెటర్లు బాలీవుడ్ భామలతో ప్రేమకలాపాలు సాగించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొంత మంది పెళ్లిల్లు కూడా చేసుకున్నారు. అలా ఒకప్పటి పాకిస్తాన్ జట్టు కెప్టెన్, నేటి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బాలీవుడ్ తార రేఖ కూడా ప్రేమలో పడ్డారంటా. రేఖ అనగానే అందరికీ అమితాబచ్చన్ గుర్తుకు వస్తారు. కానీ ఇమ్రాన్, రేఖ మాత్రం పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. ప్రపంచంలో పలు దేశాలు పర్యటించారట. ఒకానొక దశలో రేఖ.. ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని భావించారట. అయితే ఇమ్రాన్ మాత్రం ‘హీరోయిన్లతో సహచర్యం కొన్ని రోజులే బాగుంటుంది. వారితో రిలేషన్‌షిప్‌ను నేను ఆస్వాదించేవాడిని. ఇంకాస్త ముందుకు వెళ్లేవాడిని.. అయితే మీరు అనుకున్న నటిని మాత్రం పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు’ అని ఇమ్రాన్ చెప్పుకొచ్చాడు. ఈ కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..