రైతులకు సూచన.. ‘వరి విస్తీర్ణం తగ్గించి ఇతర పంటలు వేయండి’

by  |
రైతులకు సూచన.. ‘వరి విస్తీర్ణం తగ్గించి ఇతర పంటలు వేయండి’
X

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో సోమవారం బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర రైతు వేదికలో యాసంగి పంట‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వ్యవసాయ అధికారి కె.అభిమన్యుడు మాట్లాడుతూ.. రైతులు రాబోవు యాసంగికి వరి విస్తీర్ణం తగ్గించి ఇతర పంటలు సాగు చేయాల్సిందిగా కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ వి. లక్ష్మీ నారాయణమ్మ రైతులకు యాసంగిలో వేయాల్సిన పంటలను గురించి వివరించారు. పంటల విషయంలో తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం పై జాగ్రత్తలు వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.విశ్వతేజ మన జిల్లాలో చేస్తున్న వ్యవసాయ పరిశోధలు గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బి. తాతారావు, వ్యవసాయ అధికారి మణి శంకర్, రైతు బంధు కో ఆర్డినేటర్ మారం శ్రీనివాసరెడ్డి రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed