ఆ గ్రామ పంచాయతీకి అంబులెన్స్ రాలేని దుస్థితి.. ఎందుకంటే?

by  |
ఆ గ్రామ పంచాయతీకి అంబులెన్స్ రాలేని దుస్థితి.. ఎందుకంటే?
X

దిశ, తాండూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై కల్వర్టులు ( హై లెవెల్ బ్రిడ్జిలు) నిర్మించక పోవడం వలన నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, వాహనచోదకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రేచిని గ్రామపంచాయతీ పరిధిలోని బల్హాన్ పూర్ గ్రామానికి మట్టి రోడ్డు నిర్మించి ఒర్రెపై నామమాత్రంగా రింగులు వేసి వదిలేశారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డు బురదమయం అవుతోంది.

ఏ రోగం వచ్చినా గ్రామానికి అంబులెన్స్ రాలేని దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో రోడ్లు, కల్వర్టులు బాలేక తక్కలపల్లి, ఐబీ, తాండూరు మీదుగా దాదాపు 25 కిలో మీటర్లు అదనంగా రేచినికి ప్రయాణం చేసి రేషన్ సరుకులు తెచ్చుకుంటామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్జలపల్లి గ్రామం మూల మలుపు సమీపంలో రేచిని ప్రధాన రహదారిపై నుండి చెరువులు, కాలువల నీళ్లు, వరద నీరు పారుతుండటం వలన గంటల తరబడి ఇరువైపుల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో వరద నీరు తగ్గేవరకు వరకు రోడ్డు పై వేచి చూడాల్సి వస్తోందని ప్రజలు, వాహనచోదకులు వాపోతున్నారు. ఇప్పటికైనా మండల ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నాణ్యమైన రోడ్లు, హై లెవల్ కల్వర్టులు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed