కేంద్రానికి రియల్టీ డెవలపర్ల వినతి

by  |
కేంద్రానికి రియల్టీ డెవలపర్ల వినతి
X

దిశ, వెబ్‌డెస్క్: సిమెంట్ తయారీ పరిశ్రమలో అధిక ధరలను నియంత్రించేందుకు రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలని రియల్టీ డెవలపర్లు ప్రభుత్వాన్ని కోరారు. కంపెనీలు లాభాలను ఆర్జించాలనే ప్రయత్నంలో భాగంగా ధరలను పెంచుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. 20 వేల మందికిపైగా వ్యాపార సంస్థలతో, నిర్మాణ పరిశ్రమలోనే అత్యున్నత సంస్థగా ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ఈ మేరకు ప్రధానమంత్రిని కోరింది.

ఇటువంటి నియంత్రణ తయారీదారుల్లో అనైతికంగా ధరలను పెంచకుండా ఉండేందుకు తోడ్పడుతుందని బీఏఐ పేర్కొంది. ఈ ఏడాది మేలో కరోనా నేపథ్యంలో అనూహ్యంగా సిమెంట్, ఉక్కు తయారీదారులు ధరలను పెంచేశారని, ప్రత్యేక రెగ్యులేటరీ ఏర్పాటుతో ప్రభుత్వం జోక్యం కోరుతున్నట్టు బీఏఐ వెల్లడించింది. ‘మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ రంగం లాంటి ఆర్థిక వృద్ధికి, మొత్తం నిర్మాణ రంగానికి ప్రాథమిక అవసరమైన సిమెంట్‌పై లాభాల కోసం కొన్ని సంస్థలు అధిక ధరలను నిర్ణయిస్తున్నాయి.

సామాన్యుల ప్రయోజనాలను రక్షించడం కోసం, రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మోహన్ తెలిపారు. టెలికాం, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ రంగాలకు మాదిరిగా సిమెంట్ పరిశ్రమకు కూడా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని బీఏఐ ప్రభుత్వాన్ని కోరింది. కాగా, సిమెంట్ పరిశ్రమ 1989లో డీ-కంట్రోల్ చేయబడిన తర్వాత, 1991లో ఆర్థిక సరళీకరణ విధానం ప్రకారం డీ-లైసెన్స్ పొందింది. మార్కెట్లో డిమాండ్ ఆధారంగా కొత్త ప్లాంట్‌ల ఏర్పాటు నిర్ణయాలను పరిశ్రమలే తీసుకుంటాయి.



Next Story

Most Viewed