ప్రభుత్వ చెక్ డ్యామ్ ను ధ్వంసం చేసిన రియల్టర్లు

by  |
ప్రభుత్వ చెక్ డ్యామ్ ను ధ్వంసం చేసిన రియల్టర్లు
X

దిశ, జడ్చర్ల : భూగర్భ జలాలు పెంచాలన్న ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం 1995 లో నిర్మించిన చెక్ డ్యాం కట్టను ధ్వంసం చేసి మట్టితో కప్పివేశారు. పరివాహక ప్రాంత రైతులకు భూగర్భజలాలు తగ్గుతాయని ధ్వంసం చేసిన చెక్ డ్యామ్ పునర్నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతుల కోరుకుంటున్నారు. మిడ్జిల్ మండలం లోని వేముల గ్రామ పంచాయతీ శివారులోని సర్వే నెంబర్ 157/ఇ లో భూగర్భ జలాలు పెంచి వ్యవసాయ పొలాల్లోని బోర్లలో నీరు సమృద్ధిగా పెరిగి రైతులకు లాభసాటిగా ఉండాలనే ఉద్దేశ్యంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులతో ఈ ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించారు.

ఈ చెక్ డ్యాం ద్వారా పరివాహక రైతులకు ఎంతో లాభసాటిగా ఉండేదని కానీ ఈ మధ్య పొలానికి ఉన్న కొందరు రియల్టర్లు రైతులకు లాభసాటిగా ఉన్న చెక్ డ్యాం కట్టను ధ్వంసం చేసి పొలాన్ని చదును చేశారని పరివాహక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ డ్యాం ధ్వంసం చేసే అధికారం రియల్టర్ల కు లేదని ధ్వంసం చేసిన చెక్ డ్యాం ను యధావిధిగా నిర్మించేట్లు అధికారులు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ చెక్ డ్యామ్ ధ్వంసం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని రైతులు కోరుకుంటున్నారు .



Next Story

Most Viewed