భారత్‌కు మద్ధతు ఇచ్చేందుకు సిద్ధంగా ఐఎంఎఫ్

by  |
భారత్‌కు మద్ధతు ఇచ్చేందుకు సిద్ధంగా ఐఎంఎఫ్
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్‌కు కావాల్సిన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) తెలిపింది. కరోనా సమయంలో భారత్‌కు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు పలు దేశాలు ముందుకు రావడం మంచి పరిణామమని ఐఎంఎఫ్ వెల్లడించింది. భారత్‌లో కొవిడ్ మహమ్మారితో పోరాడుతున్న వారికి, ప్రాణాలను కోల్పోయిన వారికి ఐఎంఎఫ్ అండగా ఉంటుందని, తమ వంతు మద్దతు ఇస్తామని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగం ప్రతినిధి జెర్రీ రైస్ చెప్పారు. భారత్‌లో కరోనా ప్రభావాన్ని ఐఎంఎఫ్ గమనిస్తూనే ఉంది. టీకా పంపిణీ వేగవంతం చేయడంతో పాటు ఆరోగ్య రంగంలో అవసరమైన ఆర్థిక వనరులను అందించనున్నాం. కరోనాతో పోరాడేందుకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని భారత్‌కు అందిస్తాం. అంతేకాకుండా అంతర్జాతీయంగానూ ఇతర దేశాలకు కరోనా సహాయక కార్యక్రమాలను రెట్టింపు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, జులై నెలలో వృద్ధి అంచనా వివరాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్టు ఐఎంఎఫ్ తెలిపింది.
Next Story