నిధుల లభ్యతపై ఆర్బీఐ గవర్నర్ సమీక్ష!

by  |
నిధుల లభ్యతపై ఆర్బీఐ  గవర్నర్ సమీక్ష!
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యవస్థలో నిధుల లభ్యత, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రుణాలకు ప్రోత్సహించే మార్గాలపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్, ఎన్‌బీఎఫ్‌సీ ప్రతినిధులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండు సెషన్లను నిర్వహించారు. బ్యాంకులతో పాటు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధుల వితరణ గురించి, లాక్‌డౌన్ అనంతరం రుణ వితరణను ఎలా పెంచాలనే అంశంపై, ఇంకా ఇతర విషయాల గురించి చర్చించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి యంత్రాంగాన్ని బలోపేతం చేయడం గురించి, రుణాలపై మారటోరియం మరో మూడు నెలలు పెంచడంపై, బాండ్ మార్కెట్లలో ఉన్న పరిస్థితులు చర్చలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.

Tags : RBI Governor, Shaktikanta Das,liquidity situation, NBFC, mutual funds



Next Story

Most Viewed