అలా చేస్తూ.. పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్

by  |
ACB-ff
X

దిశ, ములకలపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడంలేదు. డబ్బులు ఇస్తేగానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతి పనికి ఒక రేటు కట్టి ఆ డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి జూనియర్ అసిస్టెంట్ రవీందర్ రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన సాదం శ్రీనివాస్ తనతో పాటు కూతురుకి కుల ధృవీకరణ పత్రాల కోసం సెప్టెంబర్ 17న మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్ కోసం జూనియర్ అసిస్టెంట్ రవీంద్ర రావును దరఖాస్తు దారుడు కలవగా రూ. 28 వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు శ్రీనివాస్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో జూనియర్ అసిస్టెంట్ ను పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed